మంత్రి కార్యాలయం – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
గిగ్ వర్కర్స్ సమస్యలపై మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రెస్ మీట్
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి గిగ్ వర్కర్స్ (ఫుడ్ డెలివరీ, క్యాబ్, లాజిస్టిక్స్ రంగాల వలంటరీ కార్మికులు) సమస్యలపై ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా గిగ్ వర్కర్లను ఎదుర్కొంటున్న సమస్యలు, ఆర్థిక భద్రత, ఆరోగ్య బీమా, ఉద్యోగ హక్కులు తదితర అంశాలపై మంత్రి విస్తృతంగా స్పందించారు.
“నవీన కాలంలో గిగ్ వర్కర్ల పాత్ర ప్రాముఖ్యంగా మారింది. వారికి సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం చట్టపరమైన, విధానపరమైన మార్గాలను అన్వేషిస్తోంది” అని మంత్రి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో హాజరైన గిగ్ వర్కర్లు మంత్రి సానుకూల స్పందనపై హర్షం వ్యక్తం చేస్తూ, వర్షం మధ్యలోనూ “ధన్యవాదాలు మంత్రి ” అంటూ కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి కార్యాలయం

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
