జీడీ నెల్లూరు ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు
చిత్తూరు: చిత్తూరు జిల్లా గంగాధర (జీడీ) నెల్లూరు ఎమ్మెల్యే అండ్ ప్రభుత్వ విప్ అయిన డాక్టర్ వి.ఎం.థామస్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు జీడీ నెల్లూరు మండలం రామానాయుడు పల్లెలో జరిగాయి. ఆయనకు పలువురు ఎమ్మెల్యేలతో పాటు చిత్తూరు ఎంపీ, టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి నేతలు, నాయకులు, కార్యకర్తలు పుష్ప గుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బాటలో నడుస్తూ.. నియోజకవర్గ అభివృద్ధిలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా..ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న డాక్టర్ థామస్ సేవలు ప్రశంసనీయం అన్నారు. డాక్టర్ థామస్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరిన్ని జరుపుకోవాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనఃపూర్వకంగా కోరుకున్నారు.
శుభాకాంక్షలు చెప్పిన వారిలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్, మాజీ ఎమ్మెల్సీ బి.ఎన్.రాజసింహులు (దొరబాబు), పాలసముద్రం మాజీ జడ్.పి.టి.సి భీమనేని చిట్టిబాబు, మండల పార్టీ అధ్యక్షుడు సి. రాజేంద్రన్,
చిత్తూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు కమ్ రాష్ట్ర వన్నియకుల క్షత్రియ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ సిఆర్ రాజన్,
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తనయుడు, యువనాయకుడు పులివర్తి వినీల్, పెనుమూరు మండల టీడీపీ సీనియర్ నేత వీరపల్లి హరిబాబు నాయుడు, పెద్ద సంఖ్యలో నియోజకవర్గం నాయకులు ఉన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
