ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జాబ్ మేళా
తిరుపతి: తిరుపతి లోని కొత్తవీధికి చెందిన
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకులకు జీవన భృతి కల్పించాలనే సామాజిక సేవగా బుధవారం (నేడు) మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సంఘం ప్రతినిధులు కిషోర్, వాసు తెలిపారు. ఆర్యవైశ్య సంఘం ఆలోచనల్లో భాగంగా పే -టీఎం , జెప్టో (హైదరాబాద్) వారు, రెప్యూటెడ్ రీటెయిల్ కంపెనీ వారు సంయుక్తంగా ఆర్యవైశ్య సంఘం కార్యలయంలో జూలై 2, బుధవారం ఉదయం 10 గం. ల నుంచి సాయంత్రం 4 వరకు ఉచితంగా మెగా జాబ్ మేళా నిర్వహించుటకు సన్నాహలు ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ బయోడేటాతో ఇంటర్వ్యూకి తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగము చేసుకోగలరని, తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట, శ్రీకాళహస్తి వారికి ప్రాధాన్యత కలదని తెలిపారు. మంచి జీతం, ఇన్సెంటివ్స్ కలవన్నారు. పదవ తరగతి, ఆపై పాసైన వారు హాజరు కాగలరని కోరారు. పురుష అభ్యర్థులు మాత్రమే హాజరు కావాలన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
