పేదలు, మధ్య తరగతి వర్గాల వైద్య అవసరాలకు ఆర్థికంగా సహాయపడుతున్న “సీ.ఎం.ఆర్.ఎఫ్” పథకం – ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్
ఆర్థికంగా వెనుకబడ్డ వారు, ముఖ్యంగా పేదలు మరియు దిగువ మధ్య తరగతి వర్గానికి చెందిన వారు అత్యవసర వైద్య పరిస్థితుల్లో అప్పులు చేసి చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, అలాంటి బాధితులకు ప్రభుత్వం తరఫున సీ.ఎం.ఆర్.ఎఫ్ (CMRF) పథకం ద్వారా అందుతున్న ఆర్థిక చేయూత ఎంతో అండగా వుంటుందని బీఆర్ఎస్ పార్టీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ పేర్కొన్నారు.
ఈ రోజు చింతల్‌లోని తన నివాస కార్యాలయంలో, సీ.ఎం.ఆర్.ఎఫ్ కింద మంజూరైన రూ.4 లక్షల విలువగల ఎల్.ఓ.సి (Letter of Credit) పత్రాలను లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు స్థానిక నాయకుల ద్వారా అందజేశారు.
లబ్ధిదారుల వివరాలు:
- తాళ్లపల్లి అక్షయ
నివాసం: 125 గాజులరామారం డివిజన్
మంజూరైన మొత్తం: రూ.2 లక్షలు - సుజిత్ కుమార్ ఝా
నివాసం: సుభాష్ నగర్, 130 డివిజన్
మంజూరైన మొత్తం: రూ.2 లక్షలు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సురేష్ రెడ్డి, పాక్స్ చైర్మన్ పరుష శ్రీనివాస్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు విజయ్ రామ్ రెడ్డి, ఉద్యమకారుడు కస్తూరి బాలరాజు, అడ్వకేట్ కమలాకర్, గుబ్బాల లక్ష్మీనారాయణ, ఇస్మాయిల్, ప్రభాకర్, శివ నాయక్ తదితరులు పాల్గొన్నారు

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
