ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం
తిరుపతి: అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు అభిమానులు తిరుపతిలోని ఆయన విగ్రహానికి ప్రతి నెల 1వ తారీఖున పాలాభిషేకం నిర్వహించి పూలమాలలతో నివాళులు అర్పిస్తున్నారు.. ఈ క్రమంలో ఉదయం రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘంటసాల విగ్రహాన్ని శుభ్రం చేసి అనంతరం పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ప్రముఖ గాయకులు సోము ఉమాపతి ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఘంటసాల గాత్రం అజరామరమని తెలుగు భాష ఉన్నంతకాలం ఆయన పాటలు చిరస్మరణీయంగా ఉంటాయన్నారు. ఆయనపై ఉన్న అభిమానంతో ప్రతినెల ఆయనను స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి నివాళి అర్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్, ఘంటసాల అభిమానులు కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, ఆవుల కృష్ణమూర్తి యాదవ్, వినాయక రెడ్డి, టీచర్ తిరుమలయ్య, జనార్దన్ రెడ్డి, ఆది గురు స్వామి, రాజశేఖర్ రెడ్డి, పద్మనాభం, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, విద్వాన్ కస్పా పద్మనాభం, పురోహితుడు సురేష్ స్వామి, రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి పద్మనాభం తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
