రూ. 10లక్షల ఆర్ధిక సాయం చేసిన ఎమ్మెల్యే నాని
తిరుపతి: ఏనుగుల దాడిలో మృతి చెందిన సిద్దయ్య కుటుంబానికి కూటమి ప్రభుత్వం 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించగా, ఆ సాయాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని బాధిత కుటుంబానికి అందుజేశారు. ఈ మేరకు తిరుపతిలోని డిఎఫ్ఓ కార్యాలయంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని డీఎఫ్ఓ వివేక్ తో కలసి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం చెక్కును అందించారు. చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచర్ల పంచాయతీ దాసరిగూడెం కు చెందిన ఆర్.సిద్దయ్య కొద్దిరోజుల క్రితం ఏనుగుల దాడిలో మృత్యువాత పడ్డారు. ప్రభుత్వం వారి కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ దేవర మనోహర్ కూడా పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
