కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానుల జన సమీకరణ సమావేశం||
ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ పర్యటన సందర్భంగా జులై 4న లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహించే గ్రామ స్థాయి, డివిజన్ అధ్యక్షుల సమ్మేళన సభ విజయవంతం చేయడం కొరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ కోలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్.ఎల్. సి బస్వరాజు సారయ్య, జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, కో – ఆర్డినేటర్స్ శశికళ యాదవ రెడ్డి, గజ్జెల కాంతం, ఏ -పి మిథున్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ , టిపిసిసి ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి ముఖ్య అతిథులుగా HAL కాలనీ, గాజులరామారంలోని సి టీ ప్యాలస్ ఫంక్షన్ హాల్ లో ముఖ్య నాయకులు మరియు కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ సభకు ముఖ్య నాయకులు అందరూ హాజరై ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జ్ ఖర్గే సందేశాన్ని అన్ని వర్గాల ప్రజలకు వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళ నాయకురాలు, INTUC నాయకులు, NSUI నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
