మార్నింగ్ వాక్ లో పాల్గొన్న మాజీ డీప్యూటీ మేయర్
నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ లేక్ వ్యూ కాలనీలో మార్నింగ్ వాక్ కార్యక్రమంలో పర్యటించిన మాజీ డీప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ కాలనీ వాసులకు కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీ వాసులు ముఖ్యంగా రోడ్లపై చెత్త, డ్రైనేజీ, విధి కుక్కల బెడదా మరియు చెత్త సేకరణ సమస్యలను మాజీ డీప్యూటీ మేయర్ కి తెలియజేశారు. వెంటనే స్పందించి మున్సిపల్ అధికారులతో మాట్లాడి కాలనీలో చెత్త రోజు రోజు తొలగించాలని అవసరమైతే ప్రైవేట్ వాహనాలను నియమిస్తానని తెలియజేసారు. రోడ్లపై దారికి అడ్డంగా వెహికల్ పెట్టవద్దని పెడితే వాటిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. విధి కుక్కల గురించి బ్లుక్రాస్ వాళ్లకు సందేశం ఇస్తామని కాలనీలో ఎలాంటి సమస్య ఉన్ననా దృష్టికి తీసుకువస్తే నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు. ఈ ఒక్క కార్యక్రమంలో లేక్ వ్యూ కాలనీ వాసులు, ఎన్టీఆర్ నగర్ కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు..

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
