- లక్ష మందికి వితంతు పింఛన్ల పంపిణీ.*
- ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రభుత్వం ఇవాళ వితంతు పింఛన్లు పంపిణీ చేయనుంది. ఈ నెలలో స్పౌజ్ కేటగిరీలో కొత్తగా చేరిన 1,09,155 మంది మహిళలకు రూ.4 వేల చొప్పున నగదు అందనుంది. 2019-24 మధ్య పెన్షన్ తీసుకునే భర్తలను కోల్పోయిన మహిళలను కొత్తగా లబ్ధిదారుల జాబితాలో చేర్చారు… కాగా యడ్లపాడు మండలం వంకాయలపాడు గ్రామ పంచాయతీ పరిధిలో 19 మంది పింఛనుకు అర్హులైనారు… గ్రామసభ నందు క్రొత్తగా లబ్ది పొందిన వితంతువు మహిళలకు పింఛను పంపిణీ చేయడం జరిగింది..ఈ కార్యక్రమంలో పాల్గొన్న యడ్లపాడు మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు సాయిబాబు, టీడీపీ జిల్లా కన్వీనర్ వెంకయ్య, గ్రామ టీడీపీ అధ్యక్షుడు షేక్ నాగూర్, బోయపాలెం టీడీపీ గ్రామ అధ్యక్షుడు రాజ్ అహ్మద్, బూత్ కన్వీనర్ షేక్ మస్తాన్ వలీ, బుడే, నాగూర్ వలి, సాంబశివరావు, సుభానీ తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
