ఆదిమళ్ల ఉమకు తోటి ఉపాధ్యాయుల ఘన నివాళి
సూర్యపేట జిల్లా : అనారోగ్యంతో మృతి చెందిన ఆదిమళ్ల ఉమకు తోటి ఉపాధ్యాయులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నల్గొండజిల్లా కేతేపల్లి మండలం కొండకింది గూడెం గ్రామానికి చెందిన ఆదిమళ్ల ఉమ ఈ నెల 22 న అనారోగ్యంతో మృతి చెందారు. ఆదిమల్ల ఉమ కేతేపల్లి మండలకేంద్రంలో డిపాల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వారి అకాల మృతికి చింతిస్తూ శుక్రవారం దశదిన కార్యక్రమాల్లో తోటి ఉపాధ్యాయులు పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు జ్యోతి కుమార్ మోయిజ్, నజీర్, సతీష్ యాదవ్, తిరుమలేష్, విద్యార్ధుల తల్లి దండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
