తిరుపతిలో బీజేపీ మాజీమంత్రి వర్ధంతి వేడుకలు
తిరుపతి: బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు వర్ధంతి వేడుకలను తిరుపతి జిఎస్ మాడ వీధిలో బీజేపీ నాయకులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మాణిక్యాల రావు చిత్రపటానికి బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు గుండాల గోపినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ దేవాదాయ శాఖ మంత్రిగా మాణిక్యాలరావు అనేక సంస్కరణలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. ముఖ్యంగా అనేక ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు శ్రీకారం చుట్టారన్నారు. బిజెపి కార్యకర్తగా మొదలుపెట్టిన మాణిక్యాలరావు… మంత్రిగా ఎదిగారని, క్రమశిక్షణకు మారుపేరైన ఆయన జీవితం ఇప్పటి బిజెపి నాయకులకు, కార్యకర్తలకు ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఏవన్ మస్తాన్, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శాంబోలా హరినాథ్, హేమంతు, సుబ్బయ్య, బ్రహ్మానంద రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బంకు చంద్ర, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
