స్విమ్స్ పి.జి.కోర్సుల్లో చేరేందుకు నోటిఫికేషన్
తిరుపతి: టీటీడీకి చెందిన శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) మెడికల్ యూనివర్శిటిలో 2025-26 విద్యా సంవత్సరానికి పలు పి.జి. కోర్సుల్లో చేరేందుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు స్విమ్స్ రిజిస్ట్రార్ డా. అపర్ణ ఆర్.బిట్లా తెలిపారు.
కోర్సు వివరములు :
ఎంయస్సీ నర్సింగ్, యం.పి.టి, యం.యస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ లో డయాలసిస్ టెక్నాలజీ, ఎకో కార్డియోగ్రాఫీ, కార్డియాక్ కేత్ టెక్నాలజీ, పెర్ఫుషన్ టెక్నాలజీ, ఎంయస్సీ క్లినికల్ వైరాలజీ, ఎంయస్సీ క్లినికల్ సైకాలజీ, స్పెషలైజ్డ్ నర్సింగ్ తదితర కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తులు స్విమ్స్ వెబ్ సైట్లో లభ్యమవుతాయన్నారు. వివరాలకు స్విమ్స్ వెబ్సైట్ ను సందర్శించగలరని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 25వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
