జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి విషమం?
హైదరాబాద్:
బి ఆర్ ఎస్ నేత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న ట్లుగా తెలుస్తోంది.మాగంటి గోపీనాథ్ గతకొద్ది రోజులు గా కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.
దీంతో గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స తీసుకుంటున్నారు. అయితే, గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమం గా ఉన్నట్టు తెలుస్తోంది. గత నాలుగు రోజుల నుంచి ఆయన పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉన్నట్లు బంధు వులు చెబుతున్నారు.
దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ ఆయ న పరిస్థితి ఆందోళనకరం గా ఉందని అనధికారికంగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. నిన్న మధ్యాహ్నం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు.
కేసీఆర్ ఏఐజీ ఆస్పత్రికి వెళ్లడానికి కారణం వైద్య పరీక్షలు కాదని గోపీనాథ్ ను పరామర్శించడానికని తెలుస్తోంది. కిడ్నీ సమస్యే కారణమా.. ? కొన్నాళ్ల క్రితం అనారోగ్యం కారణంగా ఆస్పత్రికి వెళ్లగా.. కిడ్నీ ఫెయిల్యూర్ అని పరీక్షల్లో తేలింది. అప్పటి నుంచి ట్రీట్ మెంట్ తీసుకుంటూనే ఉన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
