పుట్ట లో నుంచి పాములు వచ్చినట్లు బయటకు వస్తున్న ఐసీఐసీఐ బ్యాంక్ బాధిత.. ఖాతాదారులు
చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంక్ ముందు ఖాతాదారులు ఆవేదన
భారీ స్కామ్ లో బట్టబయలైన మరో కోణం
చిలకలూరిపేట పట్టణానికి చెందిన షేక్ సుభాని తన భార్య మీరాభి పేరు పై ఐసీఐసీఐ బ్యాంకు నందు గోల్డ్ తనఖా పెట్టి ఒక లక్ష90 వేల రూపాయలు2021వ సంవత్సరం లో తీసుకున్నాడు.
అయితే తనఖా పెట్టిన గోల్డ్ కావాలని …బ్యాంకు వద్ద తీసుకున్న నగదు చెల్లిస్తామని వచ్చి అడుగగా….. మీ గోల్డ్ లేదు అని బ్యాంకు సిబ్బంది చెప్పడం తో ఖాతాదారుడు…. కంగు తిన్నాడు… దీంతో సుభాని తన కుటుంబ సభ్యులు తో కలసి బ్యాంకు ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు.
తన గోల్డ్ ఇవ్వక పోతే …బ్యాంకు ముందు కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశాడు
ఈ విషియం పై బ్యాంకు ఉద్యోగులను అడగక….ఈ కేసు సీఐడీ చేతిలో ఉందని….మేము చేసేది ఏమి లేదని సమాధానం ఇచ్చారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
