బి సి ఎఫ్ పట్టణ అధ్యక్షులుగా జక్కుల రాములు యాదవ్
వనపర్తి : *వనపర్తి బి సి ఎఫ్ పట్టణ అధ్యక్షులు గా జక్కుల రాములు యాదవ్ ను బి సి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నాగనమోని చెన్న రాములు నియమించి ఈ మేరకు నియామక పత్రాన్ని ఆయన చేతుల మీదుగాజక్కుల రాములుకు అందజేయడం జరిగింది అనంతరం రాష్ట్ర అధ్యక్షులు చెన్నా రాములు మాట్లాడుతూ పదవీ బాధ్యతలను చేపట్టడంతోపాటు ఆపదవికి గౌరవం తీసుకురావలసిందిగా కోరారు. వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో33 కౌన్సిలర్లలో 33 మొత్తం పోటీచేయాలని అధ్యక్షులు ఆదేశించారు. పట్టణ అధ్యక్షులు మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో .రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఏ భగవంతుగౌడ్. మరో రాష్ట్ర ఉపాధ్యక్షులు కే వెంకటేశ్వర్లు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. రామన్ గౌడు, రాష్ట్ర కార్యదర్శి ఏర్పుల తిరుపతయ్య, జిల్లా కార్మిక అధ్యక్షులు పుట్టపాక బాలస్వామి, వనపర్తి జిల్లా బీసీఎఫ్ అధ్యక్షుడు పెలివిల్ల తిరుపతయ్య యాదవ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆంజనేయులు గౌడ్,మరియు ఆంజనేయులు తదితరులు పాల్గొనడం జరిగింది.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
