అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Spread the love

అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి

కనిగిరి నియోజకవర్గం పామూరు తాసిల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు మాజీ జిల్లా నాయకులు కొమ్మలపాటి మాల్యాద్రి మాట్లాడుతూ 42 రోజుల సమ్మె పోరాటం చేసి న గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం యాపుల భారం పెంచిందని, ఎఫ్ ఆర్ ఎస్ లను రద్దు చేయాలని పోరాటాలు చేస్తున్న పట్టించుకోవడంలేదని వెంటనే రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపి కనీస వేతనం పెంచాలని గ్రాడివిటీ అమలు చేయాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఫైవ్ జి ఫోన్స్ ను అందజేయాలని, 62 సంవత్సరాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ను అందజేయాలని ఐసిడిఎస్ ప్రాజెక్టుకు నిధులు పెంచాలని, మినీ అంగన్వాడీలను మెయిన్ సెంటర్ మార్చాలని,పెంచిన వేతనాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.. డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని పామురు తాసిల్దార్ వాసుదేవరావు కు అందజేశారు పై సమస్యల పరిష్కారం కోసం పై అధికారులకు నివేదిస్తానని వాసుదేవరావు హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యం లక్ష్మి, పార్వతి ,రమీజా, అమల, రజియా ,వాణి ,రామ సుబ్బులు అనిత, వై వి నారాయణ,శంకర్ తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top