ఇన్స్పైర్, ఇగ్నైట్ కార్యక్రమం ద్వారా విద్యార్థులు నేర్చుకొని ఆచరించాలి : ఎమ్మెల్యే జారే

Spread the love

ఇన్స్పైర్, ఇగ్నైట్ కార్యక్రమం ద్వారా విద్యార్థులు నేర్చుకొని ఆచరించాలి : ఎమ్మెల్యే జారే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ విద్యార్థుల భవిష్యత్తు కోసం కొత్త ఆలోచనలు చేస్తూ స్ఫూర్తిదాయక జ్ఞానం అందించాలనే లక్ష్యంతో ఇన్స్పైర్, ఇగ్నైట్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ నుండి వచ్చిన మోటివేషన్ స్పీకర్లు విద్యార్థులతో కలసి వారి లో ప్రతిభను వెలికి తీసేలా స్ఫూర్తి కరమైన ప్రసంగాలను అందిస్తున్నారు. ఈరోజు ములకలపల్లి మండలంలో ములకలపల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాల, జూనియర్ కళాశాల, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, కమలాపురం ఆశ్రమ పాఠశాలలో మూడు చోట్ల ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పెద్ద కలలు కనండి వాటిని నెరవేర్చుకోవడానికి కృషి చేయండి. చదువుతో పాటు ఆత్మవిశ్వాసం క్రమశిక్షణను అలవరచుకుంటే జీవితాన్ని మార్చేస్తాయని పేర్కొన్నారు.
మోటివేషన్ స్పీకర్ల కృషిని ప్రత్యేకంగా అభినందించిన ఆయన ఈ కార్యక్రమం జరిగేందుకు సహకారం అందించిన కె. లక్ష్మారెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో కొత్త ఆత్మవిశ్వాసం పెంపొందుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో గన్యానాయక, ఎంపీడీవో ఎస్ వి సత్యనారాయణ,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, ఆయా పాఠశాల, కళాశాలల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top