వరంగల్ లో మల్టీ లెవల్ పార్కింగ్.

Spread the love

వరంగల్ లో మల్టీ లెవల్ పార్కింగ్..!

వరంగల్ లో మల్టీ లెవల్ పార్కింగ్..!
వరంగల్ నగరంలో పార్కింగ్ సమస్యకు పరిష్కారం చూపుతూ, అధికారులు భద్రకాళి ఆలయం ఎదురుగా ఉన్న 3 ఎకరాల స్థలంలో రూ.20 కోట్ల వ్యయంతో 5 అంతస్తుల మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ పార్కింగ్‌లో ఒకేసారి 600 కార్లు నిలిపేందుకు వీలు కల్పించనున్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ సమీపంలో ఇలాంటి పార్కింగ్ ఇప్పటికే అందుబాటులో ఉంది. అదే తరహాలో వరంగల్‌లో పార్కింగ్ సదుపాయం కల్పించేందుకు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (KUDA) చర్యలు చేపట్టింది.

You cannot copy content of this page

Scroll to Top