గిరిజనులకు అటవీ ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది మన కూటమి ప్రభుత్వం _ఎమ్మెల్యే కూన రవి కుమార్
ఆముదాలవలస పట్టణంలోని కోటి సెంటర్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన సహకార సంస్థ సీతంపేట వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సహజ సేంద్రీయ వ్యవసాయ మరియు అటవీ ఉత్పత్తుల విక్రయ కేంద్రంను శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వ సహకారంతో గిరిజన ప్రాంతాల్లో ఉత్పత్తి అవుతున్న సహజ, సేంద్రీయ ఉత్పత్తులను పట్టణ ప్రజలకు అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ కేంద్రం రైతులకు, గిరిజనులకు ఆదాయ వనరుగా, వినియోగదారులకు ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాల వనరుగా మారుతుందని తెలిపారు.
సేంద్రీయ ధాన్యాలు, మసాలా దినుసులు, తేనె, వన్య ఉత్పత్తులు తదితర పదార్థాలు ఈ విక్రయ కేంద్రంలో లభ్యమవుతాయని విక్రయ దారులు వివరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సహకార సంస్థ సిబ్బంది, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
