శాంతియుత జగద్గిరిగుట్ట కోసం ప్రతి ఒక్కరం పాటుపడదాం.
అఖిలపక్ష నాయకుల పిలుపు.
జగద్గిరిగుట్టలో జరిగిన హత్య ఘటన చాలా దారుణమని సభ్య సమాజం భయభ్రాంతులకు గురైందని ఇలాంటి సంఘటనలు మరోసారి పునరువృతం కాకుండా చూడడానికి జగద్గిరిగుట్టలోని ప్రతి ఒక్కరూ పాటుపడాలని దానికి పోలీస్ అధికారులు కూడా సహకరించాలని కోరుతూ నేడు అఖిలపక్ష నాయకులు అంబేద్కర్ విగ్రహం దగ్గర సంఘటనను ఖండించి జగద్గిరిగుట్ట సబ్ ఇన్స్పెక్టర్ అప్పారావు కి మెమోరండం ఇవ్వడం జరిగింది.
జగద్గిరిగుట్ట అంటే మినీ తెలంగాణగా పేరుపొంది రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా వలస వచ్చే కార్మికులకు నిలయంగా ఏర్పడి అందరూ కలిసిమెలిసి జీవించే ప్రాంతమని అందరూ భావించే వారని,కానీ నేడు గంజాయి కారణంగా జగద్గిరిగుట్టలో దాడులు హత్యలు గత మూడు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఒక దగ్గర ఇటువంటి హత్యలు జరుగుతున్నాయని దీనివల్ల జగద్గిరిగుట్టకు చెడ్డ పేరు రావడమే కాకుండా ఇక్కడికి కొత్తవాళ్లు రావడానికి ఇబ్బంది పడితే రాబోయే రోజుల్లో జగద్గిరిగుట్ట ప్రజలకు ఇబ్బంది ఏర్పడుతుందని కావున ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా జగద్గిరిగుట్ట వాసులందరూ రాజకీయాలకతీతంగా కలిసివచ్చి అన్ని బస్తీలలో బస్తీ పెద్దలు మరియు యువకులు కలిసి గంజాయి నిరోధక కమిటీలు ఏర్పాటు చేసి గంజాయి బస్తీలలోకి రాకుండా చేయగలిగితే ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగవ ని మంచి శాంతియుత వాతావరణం ఏర్పడి ప్రజలు సంతోషంగా కలిసిమెలిసి జీవించే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరం మన బాధ్యతగా ఈ పోరాటంలో కలిసి రావాల్సిందిగా కోరారు. అనంతరం జగదీర్ గుట్ట పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అప్పారావు కి వినతి పత్రం సమర్పించి బస్తీలలో ఖాళీగా ఉన్న ప్రదేశాలలో గస్తీని మరింత తీవ్రతరం చేయాలని గంజాయి లభించిన వారిని మరియు అమ్మిన వారిని ఈ ప్రాంతంలో ఉండకుండా బహిష్కరించాలని కోరారు. దానికి బస్తివాసులందరూ మీ తోడుంటారని జగద్గిరిగుట్టను గంజాయి లేని ప్రాంతంగా నిర్మించడంలో పోలీసులే బాధ్యత వహించి పౌర సమాజాన్ని కదిలించాలని కోరారు.
జగద్గిరిగుట్టలో గంజాయిని లేకుండా చేయడానికి ఈ నెల 11 నాడు అన్ని బస్తీ కమిటీలతోటి సమావేశం నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఐ, కాంగ్రెస్, టిఆర్ఎస్, ఏ ఐ టి యు సి, జనసేన, ఎం ఆర్ పి ఎస్, జర్నలిస్టు సంఘాల నాయకులు పాల్గొన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్, కాంగ్రెస్ నాయకులు సాయి పంతుల, టిఆర్ఎస్ నాయకులు సాజిద్, జనసేన నాయకులు సతీష్, మహాజన జర్నలిస్టు ఫోరం రాష్ట్ర నాయకులు డప్పు రామస్వామి, తొండ వెంకట్, సిపిఐ సహయ కార్యదర్శి హరినాథ్ రావు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, సిపిఐ నాయకులు సదానంద్, కే వెంకటేష్, ప్రజానాట్యమండలి అధ్యక్షులు బాబు, మైనారిటీ నాయకులు ఇమామ్, జంబు,భాస్కర్,మల్లేష్, నరసింహ, బాబు తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
