టీడీపీ నాయకుల ఘన స్వాగతం
భారత క్రికెటర్ శ్రీ చరణికి అభినందనలు
భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఉమెన్స్ వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన తెలుగు తేజం శ్రీ చరణి కి టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు.
భారత జట్టులో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా పదునైన బంతులతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన శ్రీ చరణి , వరల్డ్ కప్‌లో 9 మ్యాచుల్లో 14 వికెట్లు తీసి టీమిండియా తరఫున రెండో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచారు.
వరల్డ్ కప్ విజయం అనంతరం రాష్ట్రానికి విచ్చేసిన శ్రీ చరణి ని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి , మంత్రి సవిత , ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్నీ) , రాజ్యసభ సభ్యులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీష్ , టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ గన్నవరం విమానాశ్రయంలో ఘనంగా స్వాగతించారు.
భావి భారత బాలికలకు కలలు కనే ధైర్యాన్నిచ్చిన శ్రీ చరణి మరిన్ని విజయాలతో దేశ గర్వకారణంగా నిలవాలని టీడీపీ నాయకులు ఆకాంక్షించారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
