గంజాయి కి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమంలో భాగస్వాములు కండి.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.
ఈనెల 11న జగద్గిరిగుట్టలో గంజాయి కి వ్యతిరేకంగా జరిగే సమావేశానికి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నేడు గంజాయి వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాలలో ఉదయం వ్యాయామం కోసం వచ్చే వారిని కలిసి సమావేశం కరపత్రాలను ఇచ్చి వివరించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంజాయి వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో జగద్గిరిగుట్టలో గంజాయి లేకుండా చేయడానికి అన్ని బస్తీల కమిటీలను బస్తి పెద్దలను ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నామని అందులో మీరు కూడా భాగస్వామి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తే గంజాయి అమ్మే వారికి ఒక హెచ్చరికగా వెళ్తుంది కావున భాగస్వాములు కావాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్, ఏఐటియుసి నియోజకవర్గ అధ్యక్షుడు హరినాథ్ రావు, ప్రజానాట్యమండలి అధ్యక్షుడు బాబు, యువజన నాయకులు జంబు, కనకారావు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
