అన్నమయ్య జిల్లా రాజంపేటలో రోడ్లపై ఆక్రమణల కలకలం…
రాజంపేట పట్టణంలో రోడ్లపై ఫ్రూట్స్ వ్యాపారులు విచ్చలవిడిగా దుకాణాలు వేసి రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నారు.
“మా ఇష్టం, మమ్మల్ని ఎవరు అడుగుతారు” అనే ధోరణితో కొంతమంది ఫ్రూట్స్ వ్యాపారులు వ్యవహరిస్తుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు…
ఇక అధికారులు మాత్రం ఈ పరిస్థితిని చూసి చూడనట్లే ఉన్నారని స్థానికుల ఆరోపణ.
రాజంపేటలోని మున్సిపల్ శాఖ, పోలీసు విభాగం రెండూ కూడా సమస్యను పట్టించుకోవడం లేదని ప్రజలు చెబుతున్నారు…
గతంలో పలుమార్లు వార్డు కౌన్సిలర్లు ఈ అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, ఫలితం లేకపోయిందని స్థానికులు వెల్లడించారు…
ఇటీవల జరిగిన కౌన్సిలర్ మీటింగ్‌లో కూడా ఈ సమస్యపై చర్చ జరిగినట్లు తెలిసిందే అయినా కూడా శూన్యం…
ప్రజలు మాత్రం ఇప్పుడు అధికారుల నుంచి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
