తిరుమలకు చేరుకున్న భారత రాష్ట్రపతి

Spread the love

తిరుమలకు చేరుకున్న భారత రాష్ట్రపతి

– తిరుమల: శ్రీవారి దర్శనార్థం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సాయంత్రం తిరుమల చేరుకున్నారు. తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం వద్దకు చేరుకున్న ఆమెకు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, టీటీడీ చైర్మన్ బొల్లినేని రాజగోపాల్ (బీ.ఆర్) నాయుడు, బోర్డు సభ్యులు పనబాక లక్ష్మీ, జానకీ దేవి, భానుప్రకాశ్ రెడ్డి, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పుష్పగుచ్ఛాలు అందించి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు తదితర జిల్లా ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top