జలసౌధ లో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో గౌరవెల్లి ప్రాజెక్ట్ పై సమీక్షా సమావేశం అనంతరం
మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్ ప్రాంత రైతాంగానికి శాశ్వతంగా ఉపయోగపడే గౌరవెల్లి ప్రాజెక్ట్ కి సంబంధించి లీగల్ సమస్యను ఇటీవల సుప్రీం కోర్టు పరిష్కరించింది
గౌరవెల్లి ప్రాజెక్ట్ లో నీళ్ళు నింపడానికి,కాలువలు తవ్వడానికి భూసేకరణకు సంబంధించి అవసరమైన నిధులు ఇవ్వడానికి ముఖ్యమంత్రి ,ఉప ముఖ్యమంత్రి ,ఇరిగేషన్ మంత్రి అంగీకరించారు..
పనులు వేగవంతం చేయడం తో పాటు లీగల్ సమస్యలు పరిష్కారం పరిష్కారం అయినప్పటికీ 55 ఎకరాల పునరావాసం కి సంబంధించిన సమస్య ఉంది వారిని తీసుకొచ్చి ఇరిగేషన్ మంత్రి కి కల్పించడం జరిగింది..
వారి సమస్య పరిష్కారం చేయడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు..
గౌరవెల్లి కి సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగుతున్నాయి..
వీలైనంత త్వరగా ఈ పనులన్నీ పూర్తి చేస్తూ కాలువలకు సంబంధించి భూసేకరణ లో రైతుల మద్దతు అభ్యర్థిస్తున్న..
తద్వారా బండ్ కంప్లీట్ అయింది కాలువలు తీసినట్లయితే గ్రామగ్రామాన గౌరవెల్లి నుండి గోదావరి నీళ్లు వచ్చే అవకాశం ఉంది
స్థానికంగా ప్రజలు సహకరించాలని కోరుతున్న
ప్రభుత్వం పరంగా అన్ని అంశాలు వెంటవెంటనే పరిష్కారం చేసుకునే దిశలో నా కార్యాచరణ కొనసాగుతుంది
లక్ష ఎకరాలకు పైన ఆయకట్టు ఉన్న ఎత్తైన పీఠభూమి లో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత నాది
వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసినప్పటికీ 10 సంవత్సరాలుగా కేసీఆర్ కుర్చీ వేసుకొని కడతామని చెప్పిన ప్రాజెక్ట్ కూడా ఇదే..
పూర్తికాకున్న ఎవరిని నిందించకుండా ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రాంత రైతాంగానికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
