ఇంద్రాహిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లోని సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
క్రిస్మస్ పండుగ శుభ సందర్భంగా 124 అల్విన్ కాలనీ డివిజన్ శంశిగుడా పరిధిలోని ఇంద్రాహిల్స్ కాలనీలో స్నేహ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్యఅతిధిగా డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై స్కూల్ స్కూల్ పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ శాంతి, నీతి, ప్రేమ, దయ కరుణ లతో ప్రపంచానికి కొత్త మార్గం నిర్దేశించిన క్రీస్తు జన్మదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులందరికి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియచేసారు. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, స్నేహ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మమతరాజ్, కరస్పాండెంట్ ఎం.రాజు, పి.ఎల్ ప్రసాద్, మల్లేష్, ఉపాధ్యాయులు, పిల్లలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
