బెస్ట్ కన్స్యూమర్ ఆక్టివిస్ట్ బేబీ విక్రమ్ ను సత్కరించిన డిఎస్ఓ ఎంవి ప్రసాద్
చిలకలూరిపేట
పట్టణానికి చెందిన రామచంద్రుల బేబీ విక్రమ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యుడిగా పనిచేస్తున్నారు. జిల్లాలో బెస్ట్ కన్జ్యూమర్ యాక్టివిస్ట్ గా గుర్తింపు పొందారు. బుధవారం నరసరావుపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో జరిగిన జాతీయ వినియోగదారుల దినోత్సవంలో బేబీ విక్రమ్ ను
జిల్లా పౌర సరఫరాల అధికారి ఎంవీ ప్రసాద్ ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఆయనకు జిల్లా నాయకులు మురికిపూడి ప్రసాద్, డాక్టర్ విద్యాసాగర్, రవి నాయక్, గాలయ్య, ఫిరోజ్ తదితరులు అభినందనలు తెలియజేశారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
