25వ వార్డు జనసేన పార్టీ
నాయకులు చల్లా వెంకయ్య ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగా 37వ వర్ధంతి
చిలకలూరిపేట:
విప్లవాత్మక ప్రజా నాయకుడు వంగవీటి మోహన రంగా 37వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి ప్రశాంతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అల్పాహారం ఏర్పాటు చేసి ప్రేమతో అందజేశారు.
అనంతరం విశ్వనాథ్ సెంటర్‌లోని వంగవీటి మోహన రంగా విగ్రహం వద్ద పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. రంగా త్యాగాలు, ప్రజాసేవ, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం యువతకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా వక్తలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పువ్వాడ నాగు,
పెరుమాళ్ళ వెంకట వీరాంజనేయులు, SR శ్రీను, తోట అప్పయ్య, అమ్మిశెట్టి మహేష్, మంగు నాగరాజు, పసుపులేటి మణి, సుబ్రమణ్యం, చాపల వినోద్, పరమేష్, ప్రసాద్, గోదాసు సూర్యనారాయణ, పువ్వాడ మణి, కటారి లోకేష్, రామిశెట్టి తేజ, బత్తినేని భాను ప్రకాష్, గూడూరు హేమంత్ సాయి, బాలసాయి, పువ్వాడ భానుచంద్ర, టంకశాల లోకేష్, నూసం అజయ్ కుమార్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
