ఖమ్మం బహిరంగ సభను జయప్రదం చేయండి.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమామహేష్ పిలుపు.
….
సాక్షిత : భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ నెల 18 నాడు ఖమ్మంలో ఐదు లక్షల మంది సిపిఐ కార్యకర్తలతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని దానికి కుత్బుల్లాపూర్ మండలం నుంచి వందలాదిగా కార్యకర్తలు తరలిరావాలని నేడు జగద్గిరిగుట్ట చౌరస్తా వద్ద సిపిఐ కుత్బుల్లాపూర్ మండల్ ఆధ్వర్యంలో గోడపత్రికను విడుదల చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కార్యదర్శి ఉమామహేష్ విచ్చేసి మాట్లాడుతూ దేశంలో సంపూర్ణ స్వరాజ్యాన్ని కోరుతూ తీర్మానం చేసిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని 1925 డిసెంబర్ 26 నాడు కాన్పూర్ లో ఆవిర్భవించి ఎన్నో కుట్ర కేసులను బ్రిటిష్ ప్రభుత్వం వేసినప్పటికీ భయపడకుండా స్వతంత్ర ఉద్యమ పోరాటంలో పాల్గొని విద్యార్థులను, యువకులను, కార్మికులను, రైతులను సమీకరించి చైతన్యపరిచి ప్రజానాట్యమండలి కలలతో స్వాతంత్రోద్యమ ఆకాంక్షలను ప్రజల్లోకి చొప్పించి అనేక ఉద్యమాలు నిర్వహించిన కారణంగానే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని అన్నారు.
బ్రిటిష్ వారు పారిపోవడానికి అతి ప్రధానమైనటువంటి బాంబే కార్మికుల సమ్మె, నావికాదళ సిబ్బంది తిరుగుబాటు కు నాయకత్వం వహించింది భారత కమ్యూనిస్టు పార్టీ నేనని అప్పటి నుండి ఇప్పటివరకు ఈ దేశంలో రైతుల సమస్యలను తీర్చడానికి దున్నేవానికె భూమి అనే నినాదం, ఇండ్లు లేని వాళ్లకు ఇండ్ల మరియు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని నినాదం, కార్మికుల కోసం కార్మిక సంఘాలను ఏర్పాటు చేసి ప్రపంచ కార్మికులారా ఏకంకండి అని నినాదం, ప్రజలందరికి నాణ్యమైన ఉచిత విద్యా, వైద్యం కావాలని అందరికీ ఉపాధి ఇవ్వాలని నినాదంతో పోరాటాలను నిర్వహిస్తున్నటువంటి ఏకైక పార్టీ సిపిఐ అనిఅన్నారు., నేడు డబ్బు మద్యం ప్రభావంతో రాజకీయాలు కలుషితమైనటువంటి నేపథ్యంలో డబ్బు మద్యం లేని నిజమైన ఎన్నికల కోసం నిలబడుతూ నేటికీ ప్రజల నాలుకలో మునిగి ప్రజా సమస్యల కోసం ఎర్రజెండాలే ప్రత్యామ్నాయ అనే విధంగా ఉన్నదని దానిని మరింతగా విస్తృతపరచడానికి ఖమ్మంలో జరిగే బహిరంగ సభ ఉపయోగపడుతుందని కావున కమ్యూనిస్టు పార్టీ నాయకులు,కార్యకర్తలు, సానుభూతిపరులు ప్రతి ఒక్కరు ఖమ్మం లో జరిగే బహిరంగ సభలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కే స్వామి సహాయ కార్యదర్శులు హరినాథ్ రావు, రాములు ఏఐటియుసి జిల్లా కార్యదర్శి వి శ్రీనివాస్ ప్రజానాట్యమండలి అధ్యక్షుడు బాబు సీనియర్ నాయకులు సీవెంకటేష్, దుర్గయ్య శాఖ కార్యదర్శిలు సహదేవ రెడ్డి, వెంకటేష్ సిపిఐ నాయకులు ఇమామ్, సామిల్ నరసయ్య, నర్సింలు, జానకి రాములు, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
