ఆర్లగూడెం గ్రామంలో ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా క్లెయిమ్ చెక్కుల పంపిణీ

Spread the love

ఆర్లగూడెం గ్రామంలో ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా క్లెయిమ్ చెక్కుల పంపిణీ

చిలుకూరు మండలం, ఆర్లగూడెం: ప్ర‌ధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) కింద ప్రయోజనదారులకు క్లెయిమ్ చెక్కులను తెలంగాణ గ్రామీణ బ్యాంకు చిలుకూరు శాఖ వారు ఆర్లగూడెం గ్రామంలో అందజేశారు.

ఈ కార్యక్రమంలో సూర్యాపేట ఎల్డిఎం వెంకట నాగ ప్రసాద్, బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్, ఫీల్డ్ ఆఫీసర్ అశోక్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సమత, ఏపిఎం వీరబాబు, పంచాయితీ కార్యదర్శి ప్రభాకర్, సి ఎఫ్ ఎల్ కౌన్సిలర్లు, వివో ఏ శైలజ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
మృత్యువాత పడ్డ ఖాతాదారుల కుటుంబ సభ్యులు కన్నెకంటి సైదులు, ముదిగొండ సతీష్, షేక్ సలీం పాషా లకు మూడు బీమా క్లెయిమ్ చెక్కులను బ్యాంకు అధికారులు అందించినారు.
బియ్యం జె జె బి వై పథకం ద్వారా ప్రతి సభ్యునికి మరణం సంభవించిన సందర్భంలో రూ.2 లక్షల బీమా లాభాలు అందించడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం అందించేటటువంటి పీఎం ఎస్బి వై , పీఎం జె జె బి వై ఇన్సూరెన్స్ లు కలిగి ఉండాలని ఎల్ డి ఎం వెంకట నాగ ప్రసాద్ గ్రామ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

You cannot copy content of this page

Scroll to Top