దారా విజయ్ బాబుకు ధైర్యం చెప్పి పరామర్శించిన పోలంరెడ్డి దినేష్ రెడ్డి
కోవూరు పంచాయతీకి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, నెల్లూరు పార్లమెంట్ యస్ సి సెల్ ప్రధాన కార్యదర్శి దారా విజయ్ బాబు ఇటీవల ఆరోగ్య సమస్యల కారణంగా హాస్పిటల్‌లో చికిత్స పొందిన అనంతరం డిశ్చార్జ్ అయి ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న సందర్భంగా, వారిని పర్యావరణ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకుని వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా మీరు త్వరగా పూర్తిస్థాయిలో కోలుకుని మునుపటిలాగే ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, వారికి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం జరిగింది.ఆయన వెంట టీడీపీ సీనియర్ నాయకులు చెముకుల కృష్ణ చైతన్య,బాల రవి,పాలూరు వెంకటేశ్వర్లు,ముసలి సుధాకర్,చెంబెటిచిన్నయ్య,నాటకరాణి వెంకట్, మోమిడి మురళీకృష్ణ,జాన్సన్,కోటయ్య,పుతేటి రవిచంద్ర,రమేష్, తదితరులు ఉన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
