మహనీయుడు, మహా మేధావి అయినటువంటి స్వామి వివేకానందుని జయంతి

Spread the love

మహనీయుడు, మహా మేధావి అయినటువంటి స్వామి వివేకానందుని జయంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని 281 డివిజన్ రంగారెడ్డి నగర్ లో వల్లెపు వేణు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్

 ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్  మాట్లాడుతూ మన దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన మేధావి అని, యువతకు ఆదర్శవంతుడు స్వామి వివేకానందుడు అని, స్వామి వివేకానంద జీవితం ఈనాటి యువతరానికి మార్గదర్శకమని అన్నారు. అలాగే స్వామి వివేకానంద జయంతిని నేషనల్ యూత్ డే గా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం అక్కడ ఉన్న నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. 

 ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు మోటే శ్రీనివాస్ యాదవ్, బాలరాజ్, గరికి రమేష్, రమేష్ మంజుల్కర్, షాకీర్, బండారి నారాయణ, అరవ వెంకట్, మల్లం శ్రీనివాస్ గౌడ్, తోకల శ్రీనివాస్, రమణారెడ్డి, శంకర్ గౌడ్, నాగన్న, జ్ఞానేశ్వర్ రెడ్డి, పరుసు వేణు, బస్తీ పెద్దలు సంతోష్  , యాదిరెడ్డి, వెంకటేష్, గోపాల్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top