ఉమ్మడి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మి ఉదయం ఆకస్మిక మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం అమీర్ పేట లోని నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు. శివలక్ష్మి పార్ధీవ దేహంపై పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే వెంట అమీర్ పేట బిఆర్ఎస్ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, పీయూష్ గుప్తా, ఉత్తమ్ సింగ్ తదితరులు ఉన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
