పోలీస్ ప్రజావాణికి 15 ఫిర్యాదులు
ప్రజాసేవే మా లక్ష్యం జిల్లా ఎస్పీ డి సునీత రెడ్డి స్పష్ఠీకరణ
వనపర్తి ;
ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయములో నిర్వహించే ప్రజావాణిలో భాగంగా జిల్లాలోనీ వివిధ ప్రాంతాల నుండి 15మంది పిర్యాదుదారులు వివిధ సమస్యలపై నేరుగా జిల్లా ఎస్పీ *సునిత రెడ్డి, కి ఫిర్యాదులు అందజేశారు.
ప్రతి ఫిర్యాదుపై ఎస్పీ స్పందించి స్వయంగా ఫిర్యాదును పరిశీలించి సంబంధిత పోలీస్టేషన్ అధికారులకు తక్షణమే సదరు ఫిర్యాదులపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని అదేశాలు జారీ చేశారు.
దీనితో ఫిర్యాదుదారులకు న్యాయం జరుగుతుందనే బరోసాను కలిగించే విధంగా ఎస్పీ చర్యలు తీసుకోవడంపై వచ్చిన ఫిర్యాదుదారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 15 ఫిర్యాదుల్లో
09 – భూతగాదాల ఫిర్యాదులు
03 భార్యభర్తల పిర్యాదులు
03 – పరస్పర గొడవలకు సంబంధించిన ఫిర్యాదులు వున్నాయి.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
