1989 ఎస్సై బ్యాచ్ రీయూనియన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ నగరంలోని NAC ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన 1989 ఎస్సై బ్యాచ్ రీయూనియన్ కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కె.ఆర్. నాగరాజు పాల్గొన్నారు…
ఈ సందర్భంగా బ్యాచ్‌లో మృతి చెందిన పోలీస్ అధికారులకు పుష్పాంజలి ఘటించి, రెండు నిమిషాల మౌనం పాటిస్తూ ఘన నివాళులు అర్పించారు…
అనంతరం 5వ పోలీస్ బెటాలియన్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న రోజులను స్మరించుకుంటూ, అప్పటి అనుభవాలు–జ్ఞాపకాలను గుర్తు చేసుకొని సహచరులతో ఆత్మీయంగా డాన్స్ వేస్తూ మమేకమయ్యారు….
1989 ఎస్సై బ్యాచ్‌లో ఎస్‌ఐ స్థాయి నుంచి ఐపీఎస్ అధికారిగా ఎదిగి, కమిషనర్ హోదాలో పదవి విరమణ చేసిన అనంతరం ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టి, ప్రజల చేత ఎమ్మెల్యేగా ఎన్నుకోబడిన వ్యక్తిగా కె.ఆర్. నాగరాజు పోలీస్ శాఖకు, 1989 బ్యాచ్‌కు గర్వకారణంగా నిలిచి అనేక మందికి ఆదర్శంగా నిలిచారని ఈ సందర్భంగా పలువురు అభినందనలు తెలిపారు…
ఈ కార్యక్రమంలో 1989 ఎస్సై బ్యాచ్ సభ్యులతో పాటు టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, డాక్టర్ సురేష్ బాబు, వరంగల్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్, చిలువేరు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
