శంకర్ నాయక్ మానుకోట పెదరాయుడు — భీమా నాయక్ గృహంలో ఆత్మీయ భేటీ……..!!
తెలంగాణలో లంబాడీల హక్కుల కోసం, లంబాడీలకు అండగా నిలబడే భవిష్యత్ ప్రత్యామ్నాయ నేత శంకర్ నాయకే… రాజకీయాల్లో ఆత్మీయ పలకరింపులు, స్నేహపూర్వక కలయికలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. తాజాగా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ , నూతనంగా ఇల్లు కట్టుకున్న LHPS (లంబాడీ హక్కుల పోరాట సంఘం) రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు భీమా నాయక్ నివాసానికి వెళ్లారు.
ఈ సందర్శనలో ఇరువురు నేతలు ప్రస్తుత రాజకీయ పరిణామాలు మరియు మానుకోట అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు.
మానుకోట ప్రాంతాభివృద్ధిలో శంకర్ నాయక్ చేసిన కృషిని ఈ సందర్భంగా భీమా నాయక్ కొనియాడారు.
“మానుకోట అభివృద్ధి కేవలం శంకర్ నాయక్ వలనే సాధ్యమైంది. ఆయన నిరంతరం ప్రజల కోసం తపించే నాయకుడు,” అని భీమా నాయక్ అన్నారు.
“శంకర్ నాయక్ నిజమైన మానుకోట మొనగాడు. నియోజకవర్గ రూపురేఖలు మార్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. రాబోయే కాలం, భవిష్యత్ అంతా శంకర్ నాయక్ దే!”

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
