హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటి హిల్స్ కమ్యూనిటీ లోని ప్రగతి నగర్ మెయిన్ రోడ్డు వద్ద మొదలవుతున్న సీవరేజి లైన్ పనులకు జలమండలి, జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో కలసి రోడ్ ఇన్స్పెక్షన్ లో పాల్గొన్న హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, హెచ్ఎంటి హిల్స్ కమ్యూనిటీ లోని ప్రగతి నగర్ మెయిన్ రోడ్డు వద్ద మొదలవుతున్న సీవరేజి లైన్ పనుల కొరకు అధికారులతో కలసి పరిశీలించి తగిన సూచనలు చేశామని, పనులను తక్షణమే మొదలుపెట్టాలని అధికారులకు చెప్పడం జరిగింది, అలానే ప్రతి చిన్న సమస్య గురించి చర్చించి, వెంటనే సమస్యలు పరిష్కారం జరిగేలా చూడాలని అధికారులకు చెప్పడం జరిగింది అలానే పలు కాలనీ లలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు మరియు మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక చొరవ తో డివిజన్ లో అత్యవసరం ఉన్న చోట, నిత్యం సమస్యలతో ఉన్న ప్రాంతలలో ప్రథమ ప్రాధాన్యత గా పనులు పూర్తి చేస్తామని నార్నె శ్రీనివాసరావు తెలియచేశారు.
ఏ చిన్న సమస్య అయిన నా దృష్టికి వచ్చిన తప్పకుండా పరిష్కరిస్తామని, కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళుతు సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీ లు గా తీర్చిదిద్దడమే నా ప్రథమ లక్ష్యం అని, ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని నార్నె శ్రీనివాసరావు చెప్పడం జరిగినది, అలానే అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని, మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, అదే విధంగా హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి డివిజన్గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ డీఈ మౌనిక, వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, జలమండలి వర్క్ ఇన్స్పెక్టర్ నాగరాజు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
