జగద్గిరిగుట్టలో ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు…

Spread the love

జగద్గిరిగుట్టలో ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు… ముఖ్యఅతిథిగా హాజరైన బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

126 – జగద్గిరిగుట్ట డివిజన్ జగద్గిరిగుట్ట కొండపైగల శివ మార్కండేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన మార్కండేయ జయంతి వేడుకల కార్యక్రమానికి దేవాలయ ముఖ్య సలహాదారులు & డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్ ఆహ్వానం మేరకు బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై స్వామి మార్కండేయుడికి పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…అచంచలమైన విశ్వాసం, ధైర్యం మరియు ధర్మనిష్ఠతో యమునికే ఎదురు నిలిచి అమరత్వాన్ని పొందిన ఆదర్శ పురుషుడు మార్కండేయడని, స్వామివారి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జగన్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, దేవాలయ కమిటీ సభ్యులు బేతి గోపాల్, ఎర్వ శంకరయ్య, జనార్ధన్, దత్తాత్రేయ, ప్రభాకర్, ప్రవీణ్, రమేష్, రవి, రాములు, రాజు, రాము, మహేష్, దత్తు, ఎల్లయ్య, రాజకుమార్, మహిళా నాయకురాలు ఇందిరాగౌడ్, సీనియర్ నాయకులు విఠల్, దాసు, మల్లేష్ గౌడ్, జైహింద్, రాజు, పాపులు గౌడ్, అంజయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top