కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణదేవరాయలు 555వ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది
విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీ శ్రీ శ్రీకృష్ణదేవరాయల వారి 555 జయంతి వేడుకలలో భాగంగా వారిని స్మరించుకుంటూ కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉదయం 10-00 గంటలకు చిలకలూరిపేట, 25వ వార్డు జాగుపాలెం నందు గల యానాది కాలనీలోని పేదలకు దుప్పట్లు మరియు దోమతెరలు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ సంఘ నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
తదుపరి భాస్కర్ హాల్ సెంటర్లో ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాపు నాయకులు అందరూ కూడా శ్రీకృష్ణదేవరాయలు ఘనత గురించి అలాగే ఆ కాలంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించడం జరిగింది
శ్రీ కృష్ణదేవరాయలు కాలంలో సనాతన హిందూ ధర్మాన్ని పాటిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీశైలం దేవస్థానం శ్రీకాళహస్తి దేవాలయం అలాగే ఎన్నో దేవాలయాల నిర్మాణం చేయడం శ్రీకృష్ణదేవరాయలకే సాధ్యమైందని ఈ సందర్భంగా పాల్గొన్న కాపు నాయకులు మాట్లాడటం జరిగింది
ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ సంఘం నాయకులు ఉయ్యూరు నరసింహారావు గోవిందు శంకర్ శ్రీనివాసన్ మల్లెల శివ నాగేశ్వరరావు ఊస రమేష్ ఊస రాఘవ వాట్టెం శ్రీనివాస్ రామిశెట్టి శివప్రసాద్ రంగిశెట్టి పూర్ణచంద్రరావు మంగు నాగరాజు పక్కల రమేష్ ఇంటూరి శివ నాగేశ్వరరావు బందరు కృష్ణ ప్రసాద్ కమ్మిలి శివరామకృష్ణ మిరియాల లక్ష్మీనారాయణ మారెళ్ళ శ్రీనివాసరావు శంకరపు పిచ్చయ్య భవనం శ్రీనివాసరావు పువ్వాడ నాగు తంగేళ్ల శివప్రసాద్ తంగేళ్ల రామ్మోహన్ రావు కోట చంద్ర తదితర కాపు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
