కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గణేష్ నగర్ లోని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అమృతాలయ ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరైన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్వామి వారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సమృద్ధిగా ఉండాలని,ప్రజల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని, దేవుడి దీవెనలతో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, యువజన నాయకులు, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
