కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని చింతల్, న్యూ వివేకానందనగర్‌లో ఉన్న విఘ్నాన్ సుధా టాలెంట్ స్కూల్ కరస్పాండెంట్ కె. శ్రీనివాస్ రెడ్డి , మల్లారెడ్డి మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ వైద్యుల సహకారంతో, లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ నార్త్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు మరియు స్థానిక ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచిత మందులను పంపిణీ చేశారు.
అనంతరం హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ,
“ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి మరియు ప్రజాప్రతినిధులకు మొదటి ప్రాధాన్యత. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయి. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలి” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు కె. రామేశ్వర్ రెడ్డి, లయన్స్ క్లబ్ ప్రతినిధులు బి. ఆంజనేయులు, వినోద్ జాదవ్ , సీనియర్ కాంగ్రెస్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు, యువజన నాయకులు, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు, వైద్యులు మరియు స్థానిక కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
