కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుభాష్ నగర్‌లోని శ్రీ శ్రీ శ్రీ పెద్దమ్మ–పొచమ్మ తల్లి దేవాలయ 21వ వార్షికోత్సవ వేడుకల్లో ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని, అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సమృద్ధిగా ఉండాలని, అలాగే ప్రజల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని, అమ్మవారి దీవెనలతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ప్రసాదం వడ్డించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు, యువజన నాయకులు, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
