ఆదర్శప్రాయుడు చింతల వీరయ్య……
చింతల వీరయ్య మృతి అన్ని వర్గాల ప్రజలకు తీరని లోటు.
చింతల వీరయ్య కుటుంబాన్ని పరామర్శించిన లారీ అసోసియేషన్ నాయకులు.చింతల వీరయ్య మృతి వర్తక వాణిజ్య వ్యాపార రంగాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు తీరని లోటు అని పలువురు లారీ అసోసియేషన్ నాయకులు అన్నారు. కోదాడ పట్టణంలో ఇటీవల మృతి చెందిన కాన్వాసింగ్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వీరయ్య నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంచితనానికి, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా ఉండే వీరయ్య మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరం అన్నారు. ఆయన మృతి రైతులకు, మిల్లర్లకు, లారీ అసోసియేషన్ కు తీరని లోటు అన్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో లారీ అసోసియేషన్ నాయకులు పైడిమరి వెంకటనారాయణ, ఆవుల రామారావు, రామినేని శ్రీనివాసరావు, యలమందల నరసయ్య, తోట శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
