124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ బేతల్ గాస్పల్ చర్చ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం రోజున పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. అందులో విజేతలుగా నిలిచినవారికి బహుమతులు అందిస్తూ బేతల్ గాస్పల్ చర్చ్ పాస్టర్ గోపి నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై వారి చేతుల మీదుగా విజేతలైన పిల్లలకు బహుమతులు అందించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ బేతల్ గాస్పల్ చర్చ్ పాస్టర్ గోపి గతం నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని అన్నారు. చదువుకునే పిల్లలకు ఉచితంగా ట్యూషన్స్ చెప్తూ, భోజనం పెట్టడం అభినందించే విషయం అని అన్నారు. పిల్లలకు ఉచితంగా విద్య అందిస్తూ వారి భవిష్యత్ కు బంగారు బాటలు వేస్తున్న పాస్టర్ గోపి కి కృతజ్ఞతలు తెలియచేసారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
