బేతవోలు కనకదుర్గమ్మ జాతరను శాంతియూతంగా నిర్వహించుకోవాలి…………………*ఎస్సై హనుమాన్ నాయక్….
చిలుకూరు మండలం బేతవోలు గ్రామ పంచాయితీలో అఖిల పక్ష నాయకులతో సమీక్ష నిర్వహిస్తున్న ఎస్ఐ హనుమాన్ నాయక్
ఈ నెల 12,13,14 వ తేదీల్లో మూడు రోజుల పాటు బేతవోలు గ్రామంలో జరిగే కనకదుర్గమ్మ జాతర లో అఖిల పక్ష నాయకులు సమన్వయంగా ఐక్యంగా శాంతి యూతంగా జాతరను జరుపుకోవాలని ఎస్ఐ హనుమాన్ నాయక్ సూచించారు. బేతవోలు గ్రామ పంచాయితీ కార్యాలయంలో జాతరపై అఖిల పక్ష నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండ జాతరను జరుపుకోవాలని ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా బాద్యులపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జాతరలో డ్యాన్స్ బేబి డ్యాన్స్లు, డీజేలకు అనుమతులు లేవని నిబందనల ప్రకారం అనుమతులు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వట్టికూటి నాగయ్య, ఉప సర్పంచ్ ఇట్టిమళ్ల ఏడుకొండలు, వార్డు సభ్యులు, అఖిల పక్ష నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
