జెర్రిపోతుల గూడెంలో ఘనంగా కనకదుర్గమ్మ జాతర
చిలుకూరు మండలంలోని జెర్రిపోతులగూడెం గ్రామంలో
కనకదుర్గమ్మ జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జెర్రిపోతులగూడెం గ్రామంలో కాంగ్రెస్, సీపీఐ, బీఆర్ఎస్, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో కోలాట ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సాంప్రాదాయ కళలకు జాతరలు నిదర్శనం అని అన్నారు. జాతరను శాంతి యూతంగా ఐక్యంగా జరుపుకోవాలని సూచించారు. మారుతున్న కాలంలో సాంప్రదాయ కళలను మరిచిపోకుండా సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి పండుగ నిర్వహించుకోవడం హర్షనీయం అని అన్నారు.
జాతర సందర్భంగా జెర్రిపోతుగూడెం గ్రామంతోపాటు చుట్టు ప్రక్కల గ్రామాల వారు వేలాదిగా తరలివచ్చారు. కనకదుర్గ దేవి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అబిషేకాలు నిర్వహించారు. జాతర చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారు. గ్రామంలో బంధువులతో ఇళ్లు కళకళలాడినాయి. జాతర సందర్భంగా గ్రామస్థులు పలువురు సాయంత్రం ప్రభబండ్లును ఆలకరించి ఆలయం వద్దకు తీసుకొని వచ్చి ప్రదక్షణలు చేసి ఆలయం ఆవరణంలో ప్రభలను వదిలేశారు. శుక్రవారం సాయంత్రం దేవాలయం ఆవరణం నుండి తిరిగి ప్రభలను ఇంటికి తీసుకెళ్ళారు. సందర్భంగా గ్రామంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు చిలుకూరు ఎస్ఐ హనుమాన్ నాయక్ బందోభస్తీ ఏర్పాటు చేశారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
