కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, షాపూర్ నగర్ డివిజన్ పరిధిలోని సంజయ్ గాంధీ నగర్‌లో సాయి లత మోడల్ స్కూల్‌లో పాఠశాల కరస్పాండెంట్ దయాకర్ ఆధ్వర్యంలో, మల్లారెడ్డి మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ సౌజన్యంతో ఉచిత హెల్త్ అండ్ డెంటల్ క్యాంప్‌ను విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
ఈ ఆరోగ్య శిబిరానికి అతిథిగా స్థానిక బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ , సీనియర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు బస్తీ కమిటీ అధ్యక్షులు RTC లక్ష్మీనారాయణ తో కలిసి హాజరైయ్యారు .ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ, ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని, ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్య సేవలు అందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని నిర్వాహకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్ , రవి కుమార్ , ప్రసాద్ నాయుడు , డేవిడ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
