హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్ నుండి వెంకటేశ్వర స్వామి ఆలయం దారిలో షుమారు యాభై లక్షల రూపాయల అంచనాతో పునర్నిర్మిస్తున్న స్టార్మ్ వాటర్ లైన్ పనులను జిహెచ్ఎంసి ఇంజనీరింగ్, జలమండలి అధికారులతో, కాలనీ వాసులతో కలసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు గారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, పునర్నిర్మిస్తున్న స్టార్మ్ వాటర్ లైన్ పనులను నాణ్యతతో నిర్మించాలని, త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పడం జరిగింది, అలానే ఏ చిన్న సమస్య అయిన నా దృష్టికి వచ్చిన తప్పకుండా పరిష్కరిస్తామని,
కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళుతు సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీ లు గా తీర్చిదిద్దడమే నా ప్రథమ లక్ష్యం అని, ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని నార్నె శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగినది, అలానే అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని, మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, అదే విధంగా హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి డివిజన్గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, జలమండలి సూపర్వైజర్ నరేంద్ర, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
