అష్టమి విశిష్టమైనరోజు కావున మియాపూర్‌లోని శ్రీ హేమదుర్గమ్మ అమ్మవారి ప్రాంగణంలో బండి రమేష్ లకుమా దేవి పుణ్యదంపతుల ఆధ్వర్యంలో మహారుద్ర చండీయాగం ఘనంగా నిర్వహించడం జరిగింది.
TPCC వైస్ ప్రెసిడెంట్, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ మరియు లకుమా దేవి పుణ్యదంపతులు తమ వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ మహారుద్ర చండీయాగం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
శ్రీ హేమదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి కుటుంబ సౌఖ్యం, సమాజ శ్రేయస్సు కోసం ప్రార్థించారు. తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండాలని, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబానికి చేరాలని ఆకాంక్షిస్తూ అభివృద్ధి పథంలో తెలంగాణ ప్రపంచంలో ముందడుగు వేయాలని పుణ్యదంపతులు భగవంతుని ప్రార్థించారు.సమాజ శ్రేయస్సు కోసం ఎల్లప్పుడూ ముందుండే ఈ పుణ్యదంపతులు ప్రజలందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భక్తులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. భక్తి, ఆధ్యాత్మికత నిండిన వాతావరణంలో కార్యక్రమం ఘనంగా జరిగింది.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
