మాజీ కౌన్సిలర్ చుక్క రాజు తండ్రి మృతి
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
వనపర్తి
వనపర్తి పట్టణం ఒకటవ వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్ గా పోటీలో ఉన్న చుక్కరాజు తండ్రి చుక్క సత్యం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆకస్మికంగా మృతి చెందారు
విషయం తెలుసుకున్న వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి వెంటనే ఆ బాధ్యత కుటుంబాన్ని పరామర్శించారు
చుక్క సత్యం మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు
ఉదయం వరకు బాగానే ఉన్నారని ఎన్నికల్లో నిలబడ్డ తన కొడుకును రాజును ఈరోజు పోలింగ్ ఉండడంతో ఆశీర్వదించి పంపారని, అనంతరం గుండెల్లో ఏదో దడగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించిన ఫలితం దక్కలేదని వారు వాపోయారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చుక్క సత్యం మృతి అందరికీ ఆవేదన కలిగించే విషయమేనని అయినా విధిరాతను ఎవరు తప్పించుకోలేరని రాజు కుటుంబానికి తాను అండగా ఉన్నానని ఇకపై ఉంటానని ధైర్యం చెప్పారు
కార్యక్రమంలో వనపర్తి మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వారికి ఆదిత్య, మైనార్టీ నాయకులు రహీం, రఫీ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ, లక్కాకుల సతీష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయి చరణ్ రెడ్డి, దేవన నాయుడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
